అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు తగిన శిక్షలు అవసరం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : నిర్మల్ జిల్లా నిర్మల్, భైంసా పురపాలక సంఘాలలో 2022 లో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది నియామకాల కోసం చేపట్టిన అధికారిక ఉత్తర్వుల ఆధారిత నియామకాలలో జరిగిన అవగాహతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పలువురు వారితో నిరుద్యోగులు బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టర్ వినతి పత్రంలో పేర్కొన్నారు. అధికారిక నియమ నిబంధనలు చట్టాల ఆధారిత ధ్రువపత్రాలను స్వీకరించిన అనంతరమే ఉద్యోగాల నియామకాలు చేపట్టవలసిన సంబంధిత అధికారులు ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగాల భర్తీకి పూనుకోవడం జరిగిందని ఆరోపించారు. 44 ఉద్యోగాల ప్రతి చేపట్టాల్సి ఉండగా అర్హులైన వారిని విస్మరించి అణువులైన వారికి కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఆధారాలకు సహా గుర్తించి సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగిందని వాపోయారు. ఈ కేసును సుమారు రెండు సంవత్సరాల పాటు పూర్తిస్థాయిలో విచారణ న్యాయస్థానం సంబంధించిన పురపాలక శాఖ ఉన్నత స్థాయి అధికారులు ఇందులో పాత్రధారులు, సూత్రధారులైన సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ విషయంలో తగిన విధంగా పునర్ విచారణ జరిపి అర్హులైన నిరుద్యోగులకు సదరు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.