25 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
నిర్మల్‌లో అర్ధరాత్రి ఘటన..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 23 : నిర్మల్ జిల్లా కేంద్రానికి కొద్దిపాటి దూరంలో ఉన్న చారిత్రాత్మక మహబూబ్ ఘాట్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఇందులో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు మృతి మృతిచెందగా.. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్సలు అందించిన నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు వారిని హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రులకు పంపించారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రతిరోజు మాదిరి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు వెళ్లే ముస్కాన్ ట్రావెల్స్ బస్సు నిర్మల్ జిల్లా మెహబూబ్ ఘాట్ లోది ప్రాంతంలో అదుపుతప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇందులో 45 పైగా మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని సంఘటన స్థానం చేరుకున్న రూరల్ సిఐ శ్రీనివాస్, సారంగాపూర్ ఎస్సై చంద్రమోహన్ రెడ్డి లు బస్సు ప్రయాణికుల వివారాలు అడిగి తెలుసుకున్నాక నిర్ధారించారు.
నిర్మల్ యువకులు ధైర్యంగా చికిత్సలు అందించేందుకు ముందుకు
సంఘటన స్థలానికి చేరుకున్న నిర్మల్ యువకులు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్ పై ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు ట్రావెల్ బోల్తా పడిందన్న సమాచారాన్ని తెలుసుకున్నా నిర్మల్ కాంగ్రెస్ యువజన సీనియర్ నాయకులు సయ్యద్ అర్జుమంద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీల విభాగం అధ్యక్షులు జూనేద్ మెమన్, పట్టణ అధ్యక్షుడు ఎంఎ మతిన్, రాష్ట్ర మైనార్టీల విభాగం ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజహర్ హుస్సేన్ తదితరులతోపాటు 50కి పైగా యువకులు చేరుకొని క్షతగాత్రులను స్వయాన తమచేతుల మీదుగా అంబులెన్స్ లలో ప్రైవేట్ వాహనాలలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించడమే కాకుండా వారికి అత్యవసర సేవలు చికిత్సలు అందేలా ముందస్తు ఏర్పాటు చేశారు.
అప్పటికే జిల్లా ప్రధాన ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. స్వల్ప , తీవ్ర గాయాల పాలైన వారిని ఒక్కొక్కరిగా ఐసీయూలోనే ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నవారిని హైదరాబాద్ ,నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలకు రిఫర్ చేశారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని చేరుకున్న నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్ ,సారంగాపూర్ ఎస్సై చంద్రమోహన్ రెడ్డిలు సంఘటన కు గల వాస్తవ విషయాలను తెలుసుకొని ప్రమాదానికి కారణం డ్రైవర్ అతివేగమే కారణమని నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి వైద్యుల తీరుపై బాధితుల ఆగ్రహం..
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్ లపై బుధవారం అర్ధరాత్రి బస్సు బోల్తా పడి జరిగిన ఘటనలో ఇద్దరం మృతి చెందగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మరి 50 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సులో 25 మంది స్వల్ప తీవ్ర గాయాలపాలు కాగా నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి స్థానికులు హుటా హుటిన క్షతగాత్రులను తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఒక్క డాక్టర్ ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉండడంతో దానికి కాంగ్రెస్ పార్టీ ఆయా విభాగాల నాయకులు, స్థానికులు నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సుపరింటెండెంట్ తో పాటు ఇతర వైద్యులకు జరిగిన రోడ్డు ప్రమాదాల తీరును చెప్పి అత్యవసర సేవలను ఇతర సేవలను అందించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
సంబంధిత అధికారులు వైద్యులు తక్షణమే స్పందించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల తీరి పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇతర వైద్యుల పనితీరులో మార్పు రాకుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరణాలు పెరిగే అవకాశాలు లేకపోలేవని వారు ఆందోళన వ్యక్తం చేశారు.