Trending Now

గొర్రెల మందపై హైనా దాడి..

సుమారు 65 గొర్రెలు మృతి.. మరో 20 గొర్రెలకు గాయాలు

విచారణ చేపట్టిన అటవీ శాఖ అధికారులు

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 23: గొర్రెల మందపై హైన అనే అడవి జంతువు దాడి చేసి సుమారు 65 గొర్రెలను బలి తీసుకున్న సంఘటన చిన్న కోడూరు మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం మాచాపూర్ కి చెందిన పున్నం మల్లయ్య రోజు వారిగా తన గొర్రెల మందను అడవి లో మెపుకొని వచ్చి సాయంత్రం యధావిధిగా తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న గొర్రెల పాకలో గొర్రెలను తోలి వెళ్ళారు. మల్లయ్య ఉదయం వచ్చి గొర్రెల పాకలో చూడగా.. సుమారు 65 గొర్రెలు చనిపోగా.. మరో 20 గొర్రెలు గాయపడి ఉన్నాయి. వెంటనే మల్లయ్య గ్రామస్థులకు పారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

పారేస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. గొర్రెల దాడి ఎలా జరిగింది అనే కోణంలో విచారణ చేపట్టారు. సాయంత్రం లోగా సంఘటన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా మల్లయ్య మాట్లాడుతూ.. తాను గొర్రెల ద్వారానే జీవనం సాగిస్తున్నాను అని ఉన్న గొర్లు చనిపోవడంతో తన జీవనం కష్టమని ప్రభుత్వం దయతలచి తనను ఆదుకోవాలని కోరారు.

Spread the love

Related News

Latest News