Trending Now

ఘనంగా నెహ్రూ వర్ధంతి..

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 27 : భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నెహ్రు విగ్రహానికి పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. అనంతరం టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ.. నేటికీ 61 సంవత్సరాల క్రితం భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చనిపోయారని, 16 సంవత్సరాలు భారత దేశ ప్రధానిగా పనిచేశారని, నెహ్రూ కుటుంబం దేశానికి ఎన్నో సేవలు, త్యాగాలు చేశారని, లండన్, యూఎస్ లో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు నెహ్రూ అని అన్నారు. సోషలిస్ట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, నెహ్రూ కూడా సోషలిస్టు కాబట్టి భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించడానికి కృషి చేశారని, భారత దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాట యోధులతో కలిసి పని చేశారని తెలిపారు.

స్వాతంత్ర్యనంతరం దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, ప్రాజెక్టు రంగాలలో అభివృద్ధి చెందడానికి పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టారని అన్నారు.రూర్కేలా, జంషెడ్పూర్ లాంటి ఉక్కు కర్మాగారాలు, ఐఐటీలు, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారని అన్నారు. అదే సేవాదృక్పథంతో నెహ్రూ ముని మనవారాలైన ప్రియాంక గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 24న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ,వారి కుటుంబ సభ్యుల అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ కౌన్సిలర్లు, వల్లపు రాజు, పున్న సది లావణ్య, కోమటి స్వర్ణలత సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News