Trending Now

హుస్నాబాద్ సర్వేయర్‌ను సస్పెండ్ చేయండి..

నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 27: హుస్నాబాద్ సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలని.. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములకు సంబందించి కబ్జాలు జరుగుతున్న విషయమై గత రెండు సంవత్సరాల నుండి స్థానిక తహసీల్దార్ కి ఎన్నో సార్లు ఫిర్యాదు చేసామని ఆయన స్పష్టంచేశారు. తహసీల్దార్ సర్వయర్ లు మారుతున్నారు. కానీ ఈ సర్వే నంబర్లు 12, 921 కొలచి భూములపై చర్యలు తీసుకోవడం లేదు. హద్దులు నిర్ణయించాలని అఖిలపక్షాలు కోరిన సర్వేయర్ పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు సర్వేనెంబర్ 12 లో కోట్ల విలువ చేసే ఎకరం భూమి అన్యాక్రాంతం అవుతుందన్నారు. 921 సర్వే నంబర్లు లో ఆరు ఎకరాల నర భూమి ఉంటే ఎకరంనర భూమి కబ్జా అయింది. గతంలో 627 సర్వేనెంబర్ లో రెండు ఎకరాల భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమి అని ఎవరు కొనుగోలు జరప వద్దని అప్పటి తహసీల్దార్ వాణి అట్టి భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ భూమి కూడా ఈ రోజు కనబడుటలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ భూములకు కాపలా ఉండవలసిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాజకీయ నాయకులు అండతోనే సర్వేయర్ పట్టించుకోవడం లేదన్నారు. తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.

Spread the love

Related News

Latest News