కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకు వినతి పత్రం
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 27 : రైతు, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. వర్షాకాలం సీజను ప్రారంభమైన సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, నాసిరకం విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం హామీని నెరవేర్చాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7500 సకాలంలో చెల్లించాలని, వరి ధాన్యం కొనుగోలు పూర్తిచేసి తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు 150 రోజులు పని దినాలు కల్పించి రూ. 350 రూపాయలు కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కామ ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి పద్మ, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడు శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్,జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, రైతు సంగం జిల్లా కార్యదర్శి నాగేల్లి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సుంచుల నారాయణ, చందుల సాయికిరణ్, కొబ్బనోళ్ళ నవీన్ కుమార్, జాదవ్ కిషన్, రైతులు కొబనోళ్ళ గంగన్న, జాదవ్ మోతి రామ్ పాల్గొన్నారు.