ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 28: హనుమకొండ జిల్లా పరకాల కేంద్రంగా జరుగుతున్న అక్రమ ఇండ్ల నిర్మాణాల విషయంలో అధికారుల ఉదాసీనతపై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. ఓవైపు అక్రమ ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్న యజమానులు యదేచ్చగా పనులు కొనసాగిస్తుంటే అధికారులు మాత్రం నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ.. లోపాయికారిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరకాల కేంద్రంగా జరుగుతున్న అక్రమ ఇళ్ల నిర్మాణాలపై మీడియాలో అనేక కథనాలు వెలబడుతున్నప్పటికీ పరకాల పురపాలక సంఘం, టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కూరగాయల మార్కెట్ రోడ్లో ఓ గృహ యజమాని తనకున్న అనుమతులకు మించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు.
తాను పర్మిషన్ పొందిం వితౌట్ గ్రౌండ్ ఫ్లోర్ జి ప్లస్ 2 కాగా నిర్మాణం మాత్రం విత్ గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి జీ ప్లస్ 4 నిర్మిస్తున్నారు. ఐనప్పటికీ మున్సిపల్ అధికారులు సదరు ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే నోటిస్ జారీ చేసాం. ఫైనల్ మరోసారి ఫైనల్ నోటీస్ ఇస్తామంటూ.. తెలిసినప్పటికీ తుది నోటీసు ఎప్పుడు ఇస్తారు..? చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకు సదరు అక్రమ ఇంటి నిర్మాణంపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టే ఉద్దేశం ఉందా..? లేదా..? వెల్లడించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.