Trending Now

సత్తా చాటిన ‘విజయ’ విద్యాసంస్థల విద్యార్థులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : నేషనల్ సెమ్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ సెమ్స్ ఒలంపియాడ్ 2024 పరీక్షలలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ లో గల విజయ విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటరని పాఠశాల చైర్మన్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 6వ తరగతి చదువుతున్న సూర్యతేజ జాతీయస్థాయి(ఆల్ ఇండియా) మూడవ ర్యాంకును, 9వ తరగతి విద్యార్థి సృజన, 8వ తరగతి విద్యార్థి సమన్వి రాష్ట్రస్థాయి రెండవ ర్యాంకును, 10వ తరగతి విద్యార్థి నక్షత్ర, 4వ తరగతి విద్యార్థి అఖిల్, 7వ తరగతి విద్యార్థి ప్రపుల్లత రాష్ట్రస్థాయి మూడవ ర్యాంకును, 4వ తరగతి విద్యార్థి పృథ్విక్, 6వ తరగతి విద్యార్థి తరుణిక, 3వ తరగతి విద్యార్థి మోక్షిత్, 9వ తరగతి విద్యార్థి లాస్య శ్రీ లు రాష్ట్రస్థాయి నాలుగవ ర్యాంకులు సాధించారు.

జాతీయస్థాయి మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థి సూర్యతేజ వారి తల్లిదండ్రులను
పాఠశాల యాజమాన్య బృందం ఘనంగా సన్మానించారు. గత మూడేళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సెమ్స్ ఒలంపియాడ్ లో విజయ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి జోనల్ ర్యాంకులు ప్రతి సంవత్సరం సాధిస్తున్నారని తెలియజేశారు. ఈ నేషనల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జూలై నెలలో హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో క్యాష్ అవార్డు, గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రం అందిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల జనరల్ సెక్రెటరీ అయ్యన్నగారి భూమయ్య మాట్లాడుతూ.. ఇలాంటి పోటీ పరీక్షల వల్ల విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత బయటకు వస్తుందని, ఇతర పోటీ పరీక్షలకు అలవాటు పడతారని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 61 మంది విద్యార్థులు జాతీయ, రాష్ట్ర , జోనల్ స్థాయి ర్యాంకులు సాధించారని ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రెసిడెంట్ అంబారాణి, కరెస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ట్రెజరర్ ఆడెపు సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సీరం విజయలక్ష్మి, ఆమెడ కిషన్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News