ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 31: నిర్మల్ జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం లను అదిలాబాద్‌లోని సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం ను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా ముగించుకొని, ఎన్నికలలో చివరి, కీలక ఘట్టమైన కౌంటింగ్ దశకు చేరుకున్నామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదిన ఎస్‌జీపీసీ లో జరిగే కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.
కౌంటింగ్ కు వచ్చే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద బారికెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంట్రీ పాస్లు లేనిది ఎవ్వరిని లోనికి అనుమతించరాదన్నారు. కౌంటింగ్ హాల్ లోపలికి ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, నిషేదిత వస్తువులను అనుమతించరాదని ఆదేశించారు. ఏజెంట్లు ఎవ్వరూ కూడా పెన్నులు కానీ, మొబైల్ కానీ, డిజిటల్ వాచ్ లు గాని, ఏ ఇతర ఫోటోగ్రఫీ వస్తువులు కానీ తీసుకుని రావద్దని సూచించారు.
నియోజక వర్గంల వారీగా సూచికలు ఏర్పాటు చే చేయడం జరిగిందని, వారికి కేటాయించిన బారికెడ్ లొ మాత్రమే వెళ్ళాలని సూచించారు. వాహనాలు ఎవరూ కూడా కాలేజీ లోపలికి తీసుకురావద్దని ప్రతి ఒక్కరు తమ వాహనాల పార్కింగ్ కాలేజీ బయట ఏర్పాటు చేయటం జరిగిందన్నా విషయాన్ని గుర్తించాలన్నారు.కాబట్టి మీకు సూచించిన పార్కింగ్ లొ మాత్రమే వాహనాలను ఉంచాలి. కౌంటింగ్ ప్రారంభమైన తరువాత ప్రతి రౌండ్ అనంతరం మీడియా పాయింట్ వద్ద అనౌన్స్మెంట్ వస్తుందని ఎవ్వరూ కూడా అధైర్యపడవలసిన పని లేదన్నారు. కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.