ఆలయ అభివృద్ధికి అందరి సహకారం అవసరం : అధ్యక్షులు లింగారెడ్డి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 31 : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇటీవల అత్యంత శోభాయమానంగా నిర్మించుకొని వేద పండితులు భక్తుల మంత్రచారాల మధ్య ప్రారంభించుకున్న సాయిబాబా ఆలయంలో 41 రోజుల తర్వాత నిర్వహించుకునే మండలి పూజను శుక్రవారం అత్యంత ప్రపత్తులతో నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు సాంప్రదాయ పద్ధతులలో బాబాకు నైవేద్యాలను సమర్పించుకొని పూజలు నిర్వహించారు భక్తులు తెల్లారుజామున నుంచే చల్ల కుండలతో ఆలయంలో బోనాలను సమర్పించుకున్నారు. పిల్ల పాపాలతో కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన యజ్ఞ యాగాలలో పాల్గొని వారి ఆశీర్వచనాలను పొందడంతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఆలయ అభివృద్ధికి అందరి సహకారం.. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింగారెడ్డి
నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలో నిర్మించిన ఆలయ నిర్మాణంలో గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు అన్ని వర్గాల వారి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఆలయంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మరికొన్ని అత్యవసరమైన సామాగ్రిలు అవసరమని ఆ వాటి కోసం గ్రామస్తులు తమ వంతుగా సహాయ సహకారాలు మరిన్ని అందించాలని కోరారు.