ప్రతిపక్షం, సిద్దిపేట, మే 31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బ్రహ్మా కుమారిస్ ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా బాలానందం సమ్మర్ క్యాంపు పిల్లలందరూ కలిసి యువత సిగరెట్ కు ఎలా అలవాటు పడిపోతున్నారో.. పొగాకు వల్ల కలిగే దుష్పపరిమాణాలను ఒక చిన్న స్కిట్ చేసి చూపించారు.
అనంతరం సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని మాట్లాడుతూ.. చిన్నప్పటినుండి పిల్లలు పొగాకు బానిసలవుతున్నారని వాటినుండి తొందరగా బయట పడాలని దానికోసం బుక్స్ చదవడం, సంగీతం వినడం, మనసును ఇతర విషయాలపై కేంద్రీకరించడం, మెడిటేషన్ ద్వారా సిగరెట్, పొగాకు, తంబాకు వంటి అలవాట్లను తొలగించుకోవచ్చనది పిల్లలు చిత్రాల ద్వారా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, సంస్థ ప్రతినిధి బికే స్వప్న, బిందు, ఆంజనేయ చారి, జగదీష్ శర్మ అంజన్నపాల్గొన్నారు.