గత బీఆర్ఎస్ పాలనలోనే అక్రమాలు, అరాచకాలు
అభివృద్ధిని ఓర్వలేకనే నిందారోపణలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తీగల సమ్మయ్య
ప్రతిపక్షం, మంథని, మే 31 : రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో అర్&బీ రహదారి విస్తరణలో ఆక్రమిత దుకాణాలను కూల్చివేస్తే ఆక్రోశం ఎందుకని, నిందారోపణలను మాని భూమి హక్కు పత్రాలు చూపాలని సీనియర్ కాంగ్రెస్ నేత తీగల సమ్మయ్య స్పష్టం చేశారు. పూదారి సత్యనారాయణననే పుట్ట మధుకు నాయకుడు అనే తీరుగా నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడి స్థాయిని దిగదార్చుకోవద్దని వాఖ్యానించారు. నాగపల్లి లో కూల్చిన దుకాణ సముదాయాల విషయంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాటలకు కౌంటర్ గా శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో నిర్మాణాలను కూల్చిన ఘటనలో అసలు విషయాన్ని దాటవేస్తూ, కాంగ్రెస్ పార్టీ పై ఆపాదించడం సరికాదన్నారు. సింగరేణి పునరావాసకాలనీ అయిన నాగేపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డు ని ఆనుకొని బేగంపేట వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని, ఆర్&బి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఆ నిర్మాణాలే నేడు రోడ్డు విస్తరణలో కూల్చివేయబడ్డాయని అందులో కాంగ్రెస్ పార్టీకి గాని, నాయకులకు గాని ఏలాంటి సంబంధం లేకున్న కేవలం నిందారోపణలతో రాజకీయపబ్బం గడుపుకుంటున్నారన్నారు.
కూల్చివేత విషయంలో నింద ఆరోపణమాని భూమి హక్కు పత్రాలను చూపించాలన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వాస్తవాలు తెలుసుకోవాలని, దేవుడి పేరు చెప్పి గ్రామంలోని భూములను అమ్ముకుంటున్నారని తెలిపారు. గత పది సంవత్సరాల్లో అక్రమాలు, అరచకాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులేనని, పదేళ్లు అధికారంలో ఉండి కనీసం ప్రధాన రహదారి వెంబడి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదన్నారు. మంత్రిగా శ్రీధర్ బాబు ఎన్నికైన అనతికాలంలోనే అభివృద్ధికి శ్రీకారం చుట్టి రోడ్డు విస్తరణతో పాటు డ్రైనేజీ పనులను చేపట్టారన్నారు. అభివృద్ధిని ఓర్వలేక చేస్తున్న అపనిందలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అడ్డగోలు ఇసుక రవాణా కు ఊతమిచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని, ఆ ఇసుక రవాణాలో ఎంతోమంది ప్రాణాలు పోయి, వీగత జీవులుగా మారిన అక్రమ ధనార్జనకు అలవాటు పడి అడ్డగోలుగా అక్రమ ఇసుక రవాణాకు అప్పటి అధికార బీఆర్ఎస్ నాయకులు వత్తాసు పలికారనీ డిసిసి ఉపాధ్యక్షుడు చంద్రయ్య పేర్కొన్నారు. బీసీ నాయకుడినని చెప్పుకుంటున్న పుట్ట మధు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడైన ప్రజలు ఎవరి నాయకత్వం బలపరిచారో అర్థం చేసుకుంటారని భావించిన, అతని ధోరణిలో మార్పు రాలేదనీ ఎంతసేపు మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు పేర్లతో రాజకీయం చేయడం తప్పితే మరో ధ్యాస లేదని మంథని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ ఏద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏల్లే రాంమూర్తి, ఎరుకల బాబురావు, తులసిరాం, అరెల్లి కొమురయ్య గౌడ్, తీగల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.