ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 1 : నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శనివారం భక్తులతో రద్దీ పెరిగింది. విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ముందుగా దక్షిణ గంగా అయినా గోదావరి నదిలో పుణ్యా స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సాంప్రదాయ దుస్తులలో పిల్లాపాపలతో ఆలయానికి చేరుకుని పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు చేయించడంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవి దర్శనం కోసం బారులు తీరి ఉంటున్న భక్తులు మూడు నుంచి నాలుగు గంటల పాటు వేచి చూడవలసి వస్తుంది. సెలవుల దృష్ట్యా ఆ భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నందున ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులు స్థానికులు భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు తీవ్రమైన ఎండల కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయన కూడా ఇళ్లలో చలివేంద్రాల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు.