Trending Now

వైసీపీకి బిగ్ షాక్.. మంత్రి వెనుకంజ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి చల్లా బాబు లీడింగులోకి వచ్చారు. రాజంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా.. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News