ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన నేత ప్రజ్వల్ రేవణ్ణ. జేడీఎస్ నుంచి ఆయన హసన్‌లో సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లీడింగులో ఉన్నారు. ప్రత్యర్థిపై 2327 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మండ్య నుంచి కుమార స్వామి 100937 ఓట్ల లీడింగులో ఉన్నారు. కోలార్ నుంచి అదే పార్టీ నేత మల్లేశ్ బాబు 70485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.



























