ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ విజయం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక కూటమి ఏర్పాటుకు కీలక భూమిక పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చ మొదలైంది. పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి లేదా హోం మంత్రి పదవి ఇస్తారని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరో వైపు పీఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. దాదాపు మొదటి రౌండ్ నుంచే ఆయన అధిక్యం చూపిస్తున్నారు. సమీప ప్రత్యర్థి వంగా గీతపై పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లోనే ఆధిక్యం ప్రదర్శించారు.