ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 4: సిద్దిపేటలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రోజున వైశాఖ బహుళ త్రయోదశి కావడంతో ఎల్లమ్మ దేవిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించింది. నమ్మిన భక్తుల పాలిట కొంగుబంగారమై వెలిసిందుతున్న శ్రీ రేణుక మాతను సిద్దిపేట పట్టణంలోని ప్రజలే కాకుండా సమీప గ్రామాల భక్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా దర్శించుకొని తరించారు. శాత కులాచార్య ఐలావజుల వెంకటరమణయ్య గారి ప్రతిష్టిత ఆలయంగా పేరుగాంచిన శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం దినదిన ప్రవర్తమానమై భక్తుల కొంగు బంగారమై వెలసిల్లుతోంది. అంతేకాకుండా గౌడ కుల జనులకు కులదైవంగా అలరారుతూ ఉంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనంటూ ఆలయంలోని వైదిక పండితులు భక్తులను ఆశీర్వదిస్తున్నారు.