Trending Now

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లా ఇలాకాలో వికసించిన కమలం

ప్రతిపక్షం, మంథని, జూన్ 05 : ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మరొకరు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయినప్పటికీ ఆ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి పట్టం కట్టి షాప్ కి గురి చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఒక లక్ష 31వెయ్యి 364 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుండి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించిన, పెద్దపల్లి పార్లమెంట్ లోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం తన ప్రాభవాన్ని చూపలేకపోయింది. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో లేని మెజారిటీ బీజేపీ కి ఇక్కడ వచ్చింది. ఆ అసెంబ్లీ సెగ్మెంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్య నియోకవర్గం ధర్మపురి.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత నియోజకవర్గం. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, అదేవిధంగా మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి కప్పుల ఈశ్వర్ సొంత నియోజకవర్గమైనప్పటికీ ఈ రెండు పార్టీలకు కాకుండా బిజెపి కీ ఇక్కడి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టి 8 వేల 80 ఓట్ల మెజారిటీనీ కట్టబెట్టారు. ఈ మెజారిటీని చూసిన ప్రతి ఒక్కరు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సొంత నియోజకవర్గంలో కూడా తన ఓటు బ్యాంకు నింపుకోలేకపోయారని, అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన ప్రాభవాన్ని చూపలేక పోయారని.. ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీకి మెజారిటీ రావడం పట్ల ప్రజలే కాకుండా నాయకులు సైతం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News