ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధులు నిర్మల్, జూన్ 5 : నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఆన్లైన్ లో నిర్వహించారు. పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చేవిధంగా వ్యవహరిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీస్ అధికారులను హెచ్చరించారు. ఈ నెల 17 న బక్రీద్ పండుగ సందర్బంగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు ఆదేశాలు జారీ చేశారు. గోవుల రవాణా గురించి అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. భైంసా నిర్మల్ పరిధిలలో మొత్తం 10 తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
పోలీస్ శాఖకు సహాయపడేలా రెవిన్యూ అధికారులు, సిబ్బంది సహాయం తీసుకోవాలని చెప్పారు. తనఖీ కేంద్రాలలో 24 గంటలు ఉండాలని ఆదేశించారు. బయటి వ్యక్తులు ఎవరు లేకుండా చూసుకోవాలని సూచించారు. గోవుల రక్షక్ సమితి నుండి కేవలం సమాచారం తీసుకోని గోవుల రవాణాన్ని అడ్డుకొనే వారికి నమ్మకం కలిగించాలని పేర్కొన్నారు.ఎట్టి పరిస్తితుల్లో గోవుల అక్రమ రవాణాన్ని అద్దుకోవాలని ఆదేశించారు. అట్టి రవాణా చేసే వారి పైన కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని పోలీస్టేషన్ లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకుని పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యే ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టి పకడ్బందీగా ఇంటరాగేషన్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో చార్జిషీట్ వేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెంచేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలనీ తెలిపారు. సమగ్ర విచారణ ద్వార నిందితులకు శిక్ష పడేవిధంగా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు సమాచారం సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని ఆహ్వానించి తగు సేవలు అందించాలని వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ త్వరితగతిన న్యాయస్థానం ద్వార తీర్పు వెలువడేలా చేసి శిక్షల రేటును పెంచాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలి తెల్పినారు. ఫోక్సో ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్షీ షీట్ దాఖలు చేయాలన్నారు.
నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అధికారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్ అధికారి నీతినీజాయితీతో విధులు నిర్వహించాల్సి వుంటుందని ఆదేశించారు.ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ వారి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా అధికారులు విధులు నిర్వహించాలని, ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్లుగానే సాధారణ ప్రజలకు సరైన న్యాయం అందించడం ద్వారా పోలీసు వ్యవస్థకు సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయని, అలాగే నకిలీ విత్తనాల నియంత్రణకై పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుందని పేర్కొన్నారు.రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూసేందుకైనా నకిలీ విత్తనాలను అరికట్టడం పోలీస్ అధికారులు మరింత శ్రమించాల్సిన అవసరం వుందన్నారు.శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వున్న ప్రజలు ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, మీ ఫిర్యాదుపై సరైన న్యాయం జరగని పక్షంలో మాత్రమే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలని కోరారు. ఎదైనా ఫిర్యాదు చేయాలనుకునేవారు ఫిర్యాదుదారులు 8712659599 వాట్సప్ నంబర్‌కు మీ ఫిర్యాదులను పోస్ట్ చేయడం ద్వారా ఫిర్యాదులపై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలియజేసారు. ఈ సమావేశంలో ఐపీఎస్ కాంతిలాల్, గంగారెడ్డి డీఎస్పీ జిల్లాలో గల అందరూ సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.