ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో 21 MLA సీట్లు సాధించిన తమ పార్టీ.. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఏపీ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు. జనసేన గోరంత దీపం.. కొండంత వెలుగునిచ్చిందని చెప్పారు. ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని.. ఇది రాజకీయాల్లో కొత్త మార్పునకు నాందికావాలని ఆకాంక్షించారు.
జనసేనకు మరో గుడ్‌న్యూస్..
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్‌న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.