Trending Now

సిద్ధిపేటలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది..

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయింది

వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం..

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 05: గత 33 ఏళ్లుగా ఎన్నడులేని విధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తున్నదని పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ పెరిగినట్లు సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఆరు అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుందని అన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపలేదని అన్నారు. వెంకట్రాంరెడ్డి రెడ్డి వర్గానికి చెందిన వారని మెదక్ జిల్లాలో వెల్మకు సంబంధించిన వారే ఉండాలని దురుద్దేశంతో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీకి మద్దతు తెలిపారని అన్నారు. అందుకే పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కు చెందిన ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయని దానివల్లే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని స్పష్టంగా తేలిపోయిందని అన్నారు. పైగా ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెప్పుకోవడం సిగ్గుచేటని ఇప్పటికైనా తన తప్పును క్షమించాలని ప్రజలను కోరాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏలాంటి ప్రభావం చూపలేకపోయిందని అన్నారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం లో ఇటీవల ఇతర పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వారు. ఇతర పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన వారి ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు పడ్డాయో అంతే మెజార్టీ వచ్చింది తప్ప కొత్తగా వచ్చింది ఏమీ లేదని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూశారని మతం పేరుతో వచ్చిన బీజేపీ నైతికంగా ఓడిపోయిందని అన్నారు.

బీజేపీ పార్టీకి ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఓట్లు పడలేదని వారంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు నాయకులు కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పనిచేసి సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా అందరం కృషి చేద్దామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల వరకు నిర్విరామంగా కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ మరో పదైళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం పనిచేద్దామని అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను సీఎం రేవంత్ రెడ్డి గుర్తిస్తారని ఎవరు అధైర్య పడవవద్దని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేదని ఆ కారు ఇక షెడ్డుకు పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చి దేశంలో ప్రధానమంత్రి అవుతానన్న కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గ్యదరి మధు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మజర్మాలిక్, పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్, ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాశద్, నాజ్జు అయ్యూబ్, ఫేయాజ్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News