నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నదని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని అక్కాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయి పాఠశాల విద్యార్థినులు కలెక్టర్ కు పుష్పగుచ్చ ఇచ్చి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సుమారు 15 రోజులపాటు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వినూత్నమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. విద్యార్థులలో గుణాత్మక విద్యను పెంపొందించడంతోపాటు విద్యా వైజ్ఞానిక పరమైన పరిజ్ఞానాన్ని కలిగించేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కష్టపడాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధనలలో పలు పలు విప్లహాత్మక మార్పులు తీసుకొచ్చి వైజ్ఞానిక పరమైన నవీన పద్ధతులలో బోధన తరగతుల నిర్వహించిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రాథమిక స్థాయి ప్రభుత్వ పాఠశాలల నుంచే విద్యార్థులలో ఆయన నైపుణ్యాలను పెంపొందించేలా పాఠ్యాంశాల ఆధారంగా భోధనాలను కొనసాగించాలని కోరారు. పాఠశాల భవనాలలో తగిన విధంగా సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవలే తగిన నిధులు కేటాయించి అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలతో పాటు దుస్తులు ఇతర విద్యాభ్యాసకరమైన సామాగ్రిలను ప్రభుత్వమే అందజేస్తున్నదని తెలిపారు. ఈ 15 రోజులలో ప్రభుత్వ పాఠశాలలో పెంచే విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల పనితీరును పరిజ్ఞానంలోకి తీసుకోవాల్సి వస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కలెక్టర్ వెంట నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి, మండల విద్యాధికారి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.