Trending Now

మిషన్ భగీరథ నల్లా కనెక్షన్‌లపై ఇంటింటి సర్వే..

జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 06: సిద్దిపేట జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల లపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ మొబైల్ అప్లికేషన్ పైన నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జిల్లా తరపున హైదరాబాద్ లో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్ చే ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొబైల్ అప్లికేషన్ చేసే విధానం గుర్చి క్లుప్తంగా వివరించారు. ఈ మొబైల్ అప్లికేషన్ సర్వే కోసం జిల్లాలోని అయా గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ టిచర్స్, ఆశా వర్కర్లు, ఇతరులను దాదాపు 1200 మందికీ రెండు సెషన్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 2లక్షల17 వేల నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఈ సర్వే జిల్లాలో మిషన్ భగీరథ కనెక్షన్ ఎన్ని? ఇతర నళ్ళ కనెక్షన్లు ఎన్ని..? నీరు వస్తున్న, నీరు రాని కనెక్షన్ల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి ఆపరేటర్ ఇంటింటికీ తిరిగి నల్ల కనెక్షన్ చెక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలను ఈ మొబైల్ అప్లికేషన్లో ఎంట్రీ చెయ్యాలన్నారు.

సర్వేలో తప్పనిసరిగా 2 పోటోగ్రాప్స్ 1. నళ్ళ కనెక్షన్ పోటో 2. కుటుంబ యజమాని పోటో తీసుకోవాలన్నారు. ప్రతి ఆపరేటర్ రోజు 25 అప్లికేషన్లు 10 రోజుల పాటు చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వే అత్యంత పారదర్శకంగా పూర్తి చెయ్యాలనీ, మున్సిపాలిటీలొ ఇంటింటికి ఎక్కవ కనెక్షన్లు ఉన్న యెడల కుటుంబంలో సభ్యుల వివరాలతో కూడిన విధంగా ఇంటి యజమానులు వివరాలను ఎంట్రీ చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఓక కనెక్షన్ కి ఒకరి వివరాలు మాత్రమే అప్లోడ్ అవుతాయన్నారు. రెండో కనెక్షన్ కి కుటుంబం లో వారసుల వివరాలను అప్లోడ్ చెయ్యాలన్నారు. మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, మెజర్ పంచాయతీలలో ఎంపిడిఓ, ఎంపిఓ మానిటర్ చెయ్యాలనీ సూచించారు. ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకి దేవి, మిషన్ భగీరథ ఎస్ఇ శ్రీనివాస్ చారి, ఈఈ గిరిధర్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News