Trending Now

ఓటర్ల తీర్పును గౌరవిస్తాం : కాంగ్రెస్ నేత వీహెచ్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మూడవ సారి ఎన్డీఏ గెలువడం, మరో సారి మోడీకి అవకాశం ప్రజల ఇచ్చారని.. ఓటర్ల తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడతూ.. మోడీ ఓబీసీ ప్రధాని కానీ బడుగు, బలహీనర్గాలకు సమస్యలు పరిష్కారం చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తె కుల గణన చేస్తాం అని రాహుల్ గాంధీ చెప్పారు. రిజర్వేషన్‌లో 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామ్ అన్నారు. ఇవ్వాళ కీ రోల్ లో నితీష్, చంద్రబాబు లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నితీష్ కుల గణన చేస్తే 67 శాతం బీసీ లకు వచ్చింది. రాహుల్ గాంధీ చేసిన ఆలోచనను కొనసాగించాలని ఓబీసీ కన్వీనర్ గా నేను ఉండి రిజర్వేషన్ పెంచండి అని కోరాను. ఐఐటీ లో కూడా రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి బిల్ పాస్ అయ్యింది. మాండల్ కమిషన్ వచ్చింది కానీ బీసీ లు చట్ట సభల్లో డబుల్ డిజిట్ కూడా దాటడం లేదు. నితీష్, చంద్రబాబు లు కూడా అన్ని రాష్ట్రాల్లో కుల గణన కోరాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు అయినా బీసీ లకు న్యాయం జరగడం లేదు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మోడీ కి వేంకటేశ్వర స్వామి విగ్రహం ప్రధానం చేశారు. మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చాడు.. దానిని అమలు చేయించాలి. మూడవ సారి ఓబీసీ ప్రధాని గా మోడీ అవుతున్నావు కాబట్టి బీసీ లకు న్యాయం చేయాలి. ఎగ్జీట్ పోల్ ఎవరికి ఉపయోగపడుతుంది.. సెన్సెక్స్ మీద ప్రభావం చూపింది. డిల్లీకి వెళ్లి మరో సారి మోడీని కలిసి కుల గణన చేయాలని చెబుతా.. తెలంగాణ లో కుల గణన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే.. బీసీ లకు మేలు జరుగుతుందని తెలిపారు. కొంత ఆలస్యం అయిన కుల గణన తర్వాతే ఎన్నికలు పెట్టాలి. అసెంబ్లీలో కుల గణన బిల్లు పాస్ చేయించే వెంటనే మొదలు పెట్టాలన్నారు.

Spread the love

Related News

Latest News