ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: T20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌కు అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. గ్రూప్-Cలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచులో 84 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన AFG 159 రన్స్ చేయగా, అనంతరం కివీస్ 75 పరుగులకే ఆలౌటైంది. AFG జట్టులో గుర్బాజ్ 80, జద్రాన్ 44 రన్స్‌తో రాణించారు. రషీద్ ఖాన్ 4, ఫారూఖీ 4, నబీ 2 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్‌ను USA ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.