ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8: నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ కు ఆయా అవసరాల కోసం ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే నిర్మల్ నుండి రోజువారీగా వెళుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య ప్రయాణికుల సంఖ్య కంటే చాలా తక్కవగా ఉండడంతో ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించినప్పటి నుండి ఈ ఇబ్బందులు తీవ్రతరం అయినట్లు తెలుస్తుంది.
వందలాదిగా మంది ప్రయాణికులు జమాయి బస్సుల కోసం వేసి చూస్తుండగా ఒకేసారి వస్తు రావడం వెంటనే ప్రయాణికులు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ బస్సు లోకి ఎక్కెందుకు పడరాన్ని పాట్లు పడడమే కాకుండా ఒకరికొకరు మధ్య ఘర్షణలకు దిగుతున్నారు. ఈ విషయమై స్థానికంగా కొంతమంది ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ ను నిలదీయగా నిజామాబాద్ ప్రధాన మార్గంలో రైల్వే పనులు కొనసాగుతూ ఉండడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బదులు ఇస్తున్నారు. ఈ విషయంలో నిర్మల్ డిఎం, జిల్లా ఆర్ఎంలు తగిన విధంగా చొరవ చూపి నిజామాబాద్ కు నిర్మల్ నుండి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.