ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : రాజకీయాలలో గెలుపోటములు సహజమని ఓటమిని గెలుపుగా భావించి ప్రజల మధ్యనే ఉండి.. ప్రజాసేవ చేస్తూనే ముందుకెళ్తానని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు శనివారం నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు అదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా నాకు గెలిపించేందుకు కష్టపడ్డా కాంగ్రెస్ లోని ఆయా విభాగాల పదాధికారులు,నాయకులతో పాటు అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ ప్రజా సమస్యలపై నిత్య పోరాటాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందుకెళ్తానని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు నమ్మకంతో నాలుగున్నర లక్షలకు పైగా ఓట్లు వేసిన ఓటర్లందరికి జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాల ఫలాలు జిల్లాలోని అన్ని వర్గాలకు చేరేలా క్షేత్రస్థాయి నుంచి ప్రణాళిక రూపొందించుకొని కృషి చేస్తానని భరోసా కల్పించారు. నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రణాళిక బద్ధమైన రీతిలో అహర్నిశలు కృషి చేయడం జరిగిందని ఆయన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆత్రం సుగుణ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క గెలుపే లక్ష్యంగా ప్రతి ఓటరు తలుపులు కట్టడం జరిగిందని గుర్తు చేశారు.
ఆత్రం సుగుణ అనుక్షణం ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతోనే ముందుకు వెళుతుందని, గెలిచిన ఓడిన ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం కష్టపడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలు సూచనల మేరకు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతుగా ప్రణాళిక బద్ధమైన రీతిలో కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా జడ్పిటిసి ల ఫోరం అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి,టిపిసిసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎంబడి రాకేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్ , కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విభాగం జిల్లా అధ్యక్షులు జునేద్ మెమన్ , పట్టణ అధ్యక్షులు ఎంఏ మతిన్ , మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా, నిర్మల్ మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు అతిఖ్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఎల్లయ్య, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గాజుల రవి, సాగర్, గణేష్ తదితరులు ఉన్నారు.