ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కఠినంగా అమలు చేయడంతో పాటు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతులు ఇవ్వడం జరగదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఆన్లైన్ లో నిర్వహించారు. పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని ఆమె అధికారులకు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరగబోవు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహించు భద్రత పరమైన ఏర్పాట్లు రూట్ ఎస్కార్ట్ గురించి జిల్లా స్థానిక పోలిస్ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 13 కేంద్రాల ఉన్నాయని చెప్పారు. పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశామనన్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నందున పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి జనాలు గుమిగూడకుండా చర్యలు చేపడుతామన్నారు.