ఇంకిన భూగర్భ జలాలు.. సరఫరా కాని నీళ్లు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వం మార్కెటింగ్ కార్యాలయంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. మార్కెట్ కమిటీ లోనే ఉన్న మార్కెట్ యార్డ్ కు అవసరమున్నంత పరిశుద్ధమైన నీళ్లను అందించేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌లో నీటి చుక్క రావడం లేదు. శని ఆదివారాలలో నీటి సరఫరా కాక సిబ్బంది నానా తంటలుపడ్డారు. మార్కెటింగ్ కార్యాలయం తో పాటు స్థానికంగా ఉన్న గోదాములు, రైతు వేదిక ఇతర అవసరాల నిమిత్తం వచ్చే రోజువారి వందలాది మందికి పరిశుద్ధమైన నీళ్లను అందించేందుకు లక్షలు వెచ్చించి మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయ ఆవరణలోనే వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.
అయితే రెండు రోజులుగా భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి నీటి పంపు ద్వారా నీరు సరఫరా కాక పోతుండడంతో స్థానికంగా వస్తున్న వారికి తాగునీటి తిప్పలు తప్పడం లేదు. శని ఆదివారాలలో సిబ్బంది వాటర్ ప్లాంట్ ద్వారా నీళ్లను ఇచ్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలన్నీ విఫలమే ఆయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవరణలో ఉన్న వాటర్ ప్లాంట్ కు నీటి సరఫరా చేస్తేనే గాని ఇక్కడ శుద్ధమైన నీరు దొరికే అవకాశాలు లేకపోలేవు.