ప్రతిపక్షం, ప్రతినిధి సిద్దిపేట, జూన్ 10: దశాబ్దాల కల నెరవేరబోతోంది. గత కొన్నేళ్లుగా పదోన్నతులకు నోచుకోకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పదోన్నతి కల్పించేలా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కూల్ అసిస్టెంట్ హోదా దక్కనున్నది. ప్రభుత్వం భాషాపండితులను అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులను జారీచేసింది. ఈమేరకు బదిలీలు పదోన్నతులు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. దీంతో కొన్ని ఏండ్లుగా పదోన్నతుల కోసం ఎదురు భాషాపండితులకు ఊరట లభించింది. సిద్ధిపేట 191 తెలుగు, 174 హిందీ, ఉర్దూ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా 75 పీఈటీ పోస్టులను పీ డీ లుగా ఉన్నతీకరించింది. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని పండితులను పీఈ టీ లను పిలిచి సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ఈ షెడ్యూల్ ను వేగఁబవంతం చేయాలని భాషాపండితులు కోరుతున్నారు. జిల్లాలోని భాషాపండితులు పీయీటీలు చాల ఆనందంగా ఉన్నారు. భాషాపండితులు పీ ఈ టీ లను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పోరాట కల నెరవేరబోతోంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎట్టకేలకు మూడు సంవత్సరాల తరువాత ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అధికారులకు కృతఙ్ఞతలు. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ సంఘం.
గత కొన్నేళ్లుగా కేవలం 150 రూపాయలకు హైస్కూల్స్ లో మాతో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఇప్పుడు పదోన్నతుల కొరకు దీర్ఘకాలంగా పోరాటం చేసి సాధించుకున్నాం.
మహ్మద్ అబ్దుల్ రవూఫ్ జిల్లా అధ్యక్షులు
జిల్లా అధికారులు పారదర్శకంగా షెడ్యూల్ నిర్వహించాలని పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య, లింగం, శంకర్, నసీరుద్దీన్ కోరారు.