Trending Now

జిల్లా అడవులలో అరుదైన పక్షి దర్శనం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : అదిలాబాద్ జిల్లా అడవులలో అరుదైన పక్షి దర్శనమిచ్చింది. తీవ్రమైన ఎండ వేడిమి కారణంగానే దాహం తీర్చుకునేందుకు ఈ పక్షి స్థానిక అడవులలో సంచరిస్తూ ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గ్రామ సమీప అడవులలో “పొన్నం కి పిట్ట”అనే ఈ పక్షి సోమవారం మధ్యాహ్నం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ కెమెరాకు చిక్కింది. హిమాలయాల అడవులు, మధ్య పశ్చిమ భారత దేశంలోని కొండలలో ఎక్కువగా ఉండే ఈ పక్షి జిల్లా అడవులలో ప్రత్యక్షమైంది ఇది 9 రంగులలో ఉంటుందని తెల్లవారుజామున, సంధ్యా సమయాలలో వినసొం పైన “పొన్నంకి పిట్ట “రెండు స్వరాలలో అరుస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News