Trending Now

ఖానాపూర్‌లో జోరుగా అక్రమ మట్టి త్రవ్వకాలు..

పట్టింపులేని సంబంధిత శాఖల అధికారులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి.. ప్రభుత్వ విధివిధానాలు మారాయి.. అయినా అక్రమార్కుల వ్యవహారాలలో మాత్రం మార్పులు కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక, మట్టి అక్రమ రవాణాను నివారించేందుకు కఠినమైన చట్టాలను అమలు చేసే దిశగా ముందుకెళ్లి సంబంధిత జిల్లా కలెక్టర్లకు అక్రమ ఇసుక, మట్టి రవాణా అక్రమాలపై సీరియస్ గా ఉండి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో మాత్రం అవన్నీ బుట్ట దాఖాలే అవుతున్నాయన్నా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ నీకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నుండి అక్రమంగా మట్టి త్రవ్వకాలు కొందరు లక్షల వ్యాపారాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఖానాపూర్ పట్టణంలోని స్టేడియం వెనుక ప్రాంతంలో ఉన్న సదరు ఖాళీ మైదానాలు,అటవీ శివారు ప్రాంతాలలో తమదే రాజ్యంగా కొంతమంది గత కొంతకాలంగా భారీగా త్రవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తూ సదరు ప్రాంతాలలో భారీ గోతులను చేయడంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా సదరు ప్రాంతాలలో వర్షపు నీరు నిలువ ఉండి చెరువుల రూపం ఎత్తుతున్నాయి.

ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా బహటంగానే సాగుతున్న సదరు అక్రమ మట్టి ,తవ్వకాల పై రెవెన్యూ, పురపాలక, భూగర్భ గనుల శాఖ అధికారులు మాత్రం చూస్తుండి పోతున్నారనే ఆరోపణలు అందుకుంటున్నాయి. పట్టణానికి ఆనుకునే బాహాటంగా జరుగుతున్న త్రవ్వకాలపై నిఘా పెట్టవలసిన స్థానిక కొంతమంది ప్రజా ప్రతినిధులే సదరు అక్రమ మట్టి,ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై త్రవ్వకాలను కొనసాగిస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో తగిన విధంగా చొరవ చూపి అక్రమ మట్టి త్రవ్వకాలపై దృష్టి సారించి అక్రమంగా మట్టిని త్రవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని గుర్తించి చట్టరీత్య చర్యలు తీసుకొని ఖానాపూర్ పట్టణ పరిసరాలలో ఉన్న సహాయ వనరులను కాపాడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News