జిల్లా ఎస్పీ, పట్టణ సీఐలకు వేర్వేరుగా వినతి పత్రాలు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట ప్రాంతంలో ఉన్న కొమ్ము గంగాధర్ రైస్ మిల్ వెనుకాల ఉన్న పురాతన హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న రావి చెట్టును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొట్టివేసి అక్కడ ఉన్న దేవుని విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. మంగళవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్ పట్టణ సీఐ అనిల్ కుమార్ లకు నిర్మల్ బీజేపీ, బీజే వైఎం, వీహెచ్ పీ, హిందూ వాహినిల ఆధ్వర్యంలో వినతి పత్రాలను నాయకులు మెడిసెమ్మ రాజు, ఏం పవన్, పూదారి రంజిత్, ఒడిసెల అర్జున్, బి. అశోక్ లు సమర్పించారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు మాట్లాడుతూ.. కొంతమంది నిర్మల్ లో ఉద్దేశపూర్వకంగానే మత ఘర్షలను పురిగొల్పు ఎందుకు ఈ తరహ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రసిద్ధ ఆలయంలో పరిసరాల వారు సాంప్రదాయ పద్ధతులలో పూజలు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నిర్మల్ పట్టణ కేంద్రంలో పలుమార్లు జరిగాయని ఈ విషయంలో కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులతో పాటు స్థానికులపై కూడా ఉందని చెప్పారు. రావి చెట్టును కొట్టివేసిన దుండగులను వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షలు పడేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ గౌడ్, సట్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.