ఉరుములు, మెరుపులతో భయాందోళనలు స్థానికులు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : నిర్మల్ జిల్లాలో సాయంత్రం మూడున్నర గంటల వరకు సూర్యదేవుడు తనదైన ప్రతాపాన్ని ప్రదర్శించాడు నాలుగు గంటల సమయంలో ఒకేసారి వాతావరణంలో మార్పులు వచ్చేసి ఈదురు గాలులు మొదలయ్యాయి.. అంతటితో ఆగకుండా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడం మొదలైంది. దీంతో నిర్మల్ జిల్లా కడెం మండలం పరిసరాలలో నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని మామడ, కడెం బైంసా లోకేశ్వరం కుబీర్ నిర్మల్ సారంగాపూర్ మండలాలలో భారీ వర్షాల కారణంగా పడ్డారు. నిర్మల్ బైంసా రహదారిపై కూడా భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సోన్ మామడ, సారంగాపూర్, లోకేష్వరం మండలాలలోని పలు గ్రామాలలో వ్యవసాయ భూముల గుండ సాగుతున్న విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులతో నెలకులాయి. భారీ వర్షాలు ఈదురుగాలులు, మెరుపులతో కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు గంటన్నర పాటు అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారు.