ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేడు, రేపు ఖమ్మంలో డిప్యూటి సీఎం భట్టి పర్యటించనున్నారు. వారితో పాటుగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఈరోజు, రేపు పర్యటిస్తున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల పుణ ప్రారంభం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం ఎన్ ఎస్ పి క్యాంపు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేయనున్నారు. మధిర నియోజకవర్గంలో అభివ్రుద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రేపు మంత్రులతో కలిసి సీతరామ ప్రాజెక్టు పనులను డిప్యూటీ సీఎం విక్రమార్క పరిశీలన చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 30 గంటలకు మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం-పుట్టకోట, పాతర్లపాడు- గోవిందపురం గ్రామాల మధ్యన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రేపు ఉదయం 8.30 గంటలకు ఖమ్మం ప్రజాభవన్ కార్యాలయం నుంచి సీతరామ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతారు. ఉదయం 10గంటలకు దుమ్ముగూడెంకు చేరుకొని సీతరామ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. సీతరామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ రెగ్యూలేటర్, ఆశ్వారావుపేట మండలం బిజి కొత్తూర్లోని పంప్ హౌజ్, కెనాల్, ముల్కలపల్లి మండలం పంప్ హౌజ్-2, కమలపురం మండలం పూసుగూడెం లోని పంప్ హౌజ్-3, కెనాల్స్ పనులను పరిశీలిస్తారు. కమలపురం వయా పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు మీదుగా ఎన్కూర్ లింక్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు.