Trending Now

దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం.. మంత్రి పొంగులేటి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దశాబ్దాల నుండి ఖమ్మం పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముప్పు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి ఆర్‌సీసీ రిటైనింగ్‌వాల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను బుధవారం నాడు మంత్రిగారు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ.. యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది.. ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయండి. పదిరోజుల్లో మళ్ళీ వస్తా.. పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యులపై చర్యలు.. పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించండి. స్టార్టింగ్ పాయింట్.. ఎండింగ్ పాయింట్ లను గుర్తించి సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులను చేపట్టాలి.. తద్వారా మురికి నీరు మున్నేరు లో చేరకుండా ఉంటుందన్నారు.

Spread the love

Related News

Latest News