Trending Now

Breaking: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 2,36,487 మంది హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అర్హత సాధించగా.. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని అంగీకరించని ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం వెలుసుబాటు కల్పించింది.

Spread the love

Related News

Latest News