ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని 20 లక్షల మంది ఇంజనీరింగ్/మెడిసిన్/పీజీ/డిగ్రీ విద్యార్థుల మొత్తం ఫీజుల బకాయిలు 7వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కలిసి చర్చలు జరిపారు. ఈ ప్రతినిధి వర్గంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంజి, రాజేందర్, వేముల రామకృష్ణ, రఘుపతి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర కాలేజీ కోర్సులు చదివే బీసీ/ఈబీమసీ/ఎస్‌సీ/ఎస్‌టీ విద్యార్ధుల 7వేల కోట్ల ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీనితో విద్యార్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే ఫీజు బకాయిలు దాదాపు 7వేల కోట్లు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.