Trending Now

కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు..

ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్..!

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 12 : దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసింది.. ఫలితాలు కూడా వచ్చేశాయ్. తెలంగాణలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పాలనతో పాటు కార్పొరేష న్ ఛైర్మన్ పదవులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్పొరేషన్ ఛైర్మన్‌ నియమకాలు ఉంటుందనే చర్చ గాంధీ భవన్‌ వేదికగా జరుగుతోంది. మరో వైపు ఆశావహులంతా సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియ డంతో వీలైనంత త్వరగా అన్ని రకాల పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు స్టార్ట్ చేసింది. గతంలో ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందే 37 మంది నేతలను కార్పొ రేషన్ ఛైర్మన్లుగా నియమి స్తూ ప్రభుత్వం ఓ హింట్ ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అధికారికంగా జీవో రిలీజ్ కాలేదు. అయితే గతంలో ఇచ్చిన 37 కార్పొరేషన్‌లకు తోడు గా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను మరో 17 కార్పొరేషన్ ఛైర్మన్ లను నియమించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరు లేదా ఇద్దరికీ అవకాశం..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల, ముధోల్, బోథ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా ఈ 17 కొత్త కార్పొరేషన్ల చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకొని ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, యువజన మైనార్టీ నాయకులు సయ్యద్ అర్జుమంద్,ఆసిఫాబాద్ నుంచి శ్యాం నాయక్, ఉట్నూర్ ఆత్రం సుగుణ, ముధోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు ఎం ఏ లతీఫ్ లతో పాటు ఎంపీ ఎన్నికల సమయంలో అంతకంటే ముందు బీఆర్ఎస్, బిజెపి నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు మాజీ జిల్లా రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు కూడా కార్పొరేషన్ చైర్మన్ తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేతకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఓటమిపాలవడంతో కూడా ఈ చైర్మన్ పదవులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులకు ఇవ్వాలా.. వద్దా..! అనే దానిపై ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం పున : ఆలోచనలో పడ్డట్లు చెబుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఒకరే ఎమ్మెల్యేగా ఉండడం మిగతా 9 ప్రాంతాలలో ఇన్చార్జిలతోనే పాలన కొనసాగుతుండడంతోనే పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసే దిశగా జిల్లాలోని నియోజకవర్గాలలో పార్టీ వీక్ గా ఉన్న ఒక్క నియోజకవర్గం నుంచి సదరు చైర్మన్ పదవి ఒకరికి ఇస్తే బాగుంటుందని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Spread the love

Related News

Latest News