Trending Now

సిద్దిపేట ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటా.. ఎంపీ రఘునందన్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 12: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు చూపిన అభిమానానికి జీవితకాలం రుణపడి ఉంటా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సిద్దిపేటకు రఘునందన్ రావుకి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట శరబెశ్వరాలయంలో శ్రీ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొనీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమర్నాథ్ యాత్రలో అన్నదానానికి కావలసిన నిత్యవసర వస్తువుల లారీనీ జండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్ అసోసియేషన్ సభ్యుల అభినందన సభలో పాల్గొన్నారు. పార్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పార్వతి దేవి గుడి సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రఘు నందన్ రావు మాట్లాడుతూ.. మెదక్ ఎంపీగా గెలిపించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మూడో సారి కేంద్ర ప్రభుత్వం కొలువుధీరిందన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా, ఈ గడ్డ బిడ్డగా మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నారు. మెదక్ పార్లమెంట్ కీర్తి పెంచే విధంగా పార్లమెంట్ లో పేద ప్రజల గళం వినిపిస్తా అన్నారు.ఎన్డీఏ భాగస్వామ్యాల పక్షాల కుటమీ ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్ర బాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ, భాగస్వామ్య పక్షాలను ప్రజలు ఆశీర్వదించరన్నారు. 6 రాష్ట్రాలు మినహా 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ, భాగస్వామ్య పక్షాల నాయకులే సీఎంలుగా ఉన్నారన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, విద్యాసాగర్, బాసంగారి వెంకన్న, కొత్తపల్లి వేణుగోపాల్, తొడుపునూరి వెంకటేశం, వెంకట్, కోడూరి నరేష్, కాసుగొట్టు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News