ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 12 : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను కూడా ఆధునికరించి, పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం ఉట్నూర్ పరిధిలోని లక్కారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పాఠ్యపుస్తకాల దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..ప్రవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రో. జయశంకర్ బడిబాట కార్యక్రమం భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక ఆధారంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నదని చెప్పారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుందన్నారు. పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన అందించేందుకు కృషి చేస్తున్నమని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వాడి విద్యా బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణ నేలకొల్పడానికి ప్రతి పాఠశాలలో గ్రీనరిలు ఏర్పాటు చేయాలన్నారు.లక్కారం పాఠశాలలో ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా అదనపు గదులతో పాటు టివి, కంప్యూటర్ లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లితండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.