Trending Now

వెంటనే 25 వేల డీఎస్సీ ఖాళీలు నింపాలి..

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 12: కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీలో 25వేల ఖాళీలు నింపుతామని చెప్పి 11వేల ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు నింపాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో హరీష్ రావు సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేలకు పైన పాఠశాలలు పున: ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుందన్నారు. ప్రజా ప్రతినిధిగా మేము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిందనీ గుర్తు చేశారు.అభివృద్ధిలో,విద్యలో ఏ రంగంలో అయినా సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నదనీ వెల్లడించారు.

సిద్దిపేటలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుకున్నాము అన్నారు.కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్య సిబ్బందిని ఉచిత కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రి ని కోరారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో మరమ్మతు చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనీ, కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతున్నదన్నారు. విద్యార్థులు తెలుగు మీడియంలోనే కాకుండా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నా వంతు కృషి నిత్యం ఉంటుందనీ హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సొంత ఖర్చు 5 లక్షలతో గత ఏడాది స్నాక్స్ అందించారు. నిరంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి కోసం కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News