ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా సూపర్-8కు దూసుకెళ్లింది. కాగా సూపర్-8లో ఆసీస్-భారత్ జూన్ 24న తలపడనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 చేరుకుంది. ఈ నెల 20న గ్రూప్ Cలోని అఫ్గానిస్థాన్ లేదా వెస్టిండీస్, 22న గ్రూప్ Dలోని బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లతో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
USపై గెలుపు.. సూపర్-8కు భారత్..
T20WCలో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో హ్యాట్రిక్ గెలుపులతో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. ఇవాళ్టి మ్యాచ్‌లో తొలుత US 110/8 స్కోరు చేయగా, టీమ్ ఇండియా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. రోహిత్ 3, కోహ్లి 0, పంత్ 18, సూర్య 50, శివమ్ దూబే 31 పరుగులు చేశారు.