Trending Now

చేయూతనిద్దాం..!

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 13 : తల్లిదండ్రుల ఆధారాలకు నోచుకుని పిల్లలను గుర్తించి ప్రతి ఒక్కరు సామాజిక దృక్పథంతో, ఇది తమ వ్యక్తిగత సామాజిక బాధ్యతగా తీసుకొని చేయూతనివ్వాలని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆరోగ్యశ్రీ, సామాజిక సేవకుడు కౌటిక శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని బాలసదనంలో ఉన్న పిల్లలకు ఆయన నోట్ పుస్తకాలు, సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలసదనంలో ఉన్నటువంటి పిల్లలకు తన వంతుగా చేయూతనందించానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒకరు లేదా ఇద్దరినీ దత్తత తీసుకొని ఈ తరహా పిల్లలకు తమ వంతుగా చదువులకు, ఇతర అవసరాలకు సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలసదనం ఇన్చార్జి కవిత, సీడబ్ల్యూఓ సుమలత తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News