మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 13: రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘ ఆధ్వర్యంలో పురపాలక సంఘ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న అధ్యక్షతన వార్డు కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, వైద్య బృంద అధికారులకు, మున్సిపల్ అధికారులకు, వార్డ్ ఆఫీసర్లకు, మెప్మా రిసోర్స్ పర్సన్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి వార్డులో ఎక్కడైతే నీటి నిలువ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాలను గుర్తించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంటిలో ఉన్న కూలర్లలో, టైర్లలో, నిల్వ ఉన్న వాటర్ ని తొలగించేటట్టు ప్రజలకు అవగాహన చేయాలన్నారు.
త్రాగు నీటిని వృధా చేయకుండా ఆన్ ఆఫ్ సిస్టం ఏర్పరచుకునేలా ప్రజలకు తెలియజేయాలని, ఓపెన్ ప్లాట్స్ లలో వాటర్ నిలువ ఉన్న యజమానులకు నోటీసులు ఇవ్వాలని, డ్రైనేజీలో వాటర్ నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వ ఉన్న వాటర్ లో ఆయిల్ బాల్స్ వేయించాలని,దోమల నివారణను అరికట్టడానికి నిల్వ ఉన్న వాటర్ లో స్ప్రే చేయాలని, ఇంటి వద్దనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని,మున్సిపల్ సిబ్బంది , వైద్య సిబ్బంది మరియు అంగన్వాడి సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ పట్టణ ప్రజలను సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి నిఖిత గారు, కౌన్సిలర్లు స్వర్ణలత పద్మ , దొడ్డి శ్రీనివాస్, వల్లపు రాజు, బొజ్జ హరీష్ , కోఆప్షన్ మెంబర్ అయూబ్ , మునిసిపల్ అధికారులు, వైద్యాధికారులు, అంగన్వాడి సూపర్వైజర్ కవిత వార్డ్ ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.