బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్
ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 14: సిద్దిపేట పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులకే లక్షలు ఫీజు వసూలు చేస్తున్న సిద్దిపేట డీఈవో పట్టించుకోవడం లేదని బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్ ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలోకి తొక్కుతూ.. పాఠశాల యజమాన్యాలు ఇష్ట రీతిలో ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. పాఠశాలలు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకముందే సగం ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా చూసి చూడనట్టు జిల్లా అధికారులు వదిలేస్తున్నారు. దీనిపై వివరణ అడిగేందుకు వెళ్లిన బీఎస్పీ నాయకులు సరైన సమాధానం చెప్పలేక ఏం చేసుకుంటారో చేసుకోరి అన్నట్టు డీఈఓ వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే డీఈవో కార్యాలన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా పుల్లూరు ఉమేష్ హెచ్చరించారు.