Trending Now

అక్రమాలపై బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు..?

బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు

ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 14: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎన్ని అవకతవకలు అక్రమాలు జరిగిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కౌన్సిలర్లు, నాయకులు ఉన్న ప్రశ్నించే ధోరణి లేకుండా పోయిందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు అన్నారు. ఇటీవల మునిసిపాలిటీ నుండి దొంగ ఇంటి బిల్లులు, ఇల్లు లేకున్న ఇంటి నెంబర్లు, ఇట్టి ఇంటి బిల్లులతో వారికి సంబంధం లేని భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందని.. ఇంటి బిల్లుల ప్రొసీడింగ్ కాఫీలో కమిషనర్ సంతకం పెట్టాడా..? లేకపోతే ఆ సంతకాలు ముద్రలు ఎవరు ఫోర్జరీ చేశారో మున్సిపాలిటీలో బాధ్యత వహిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలకు తెలియ చెప్పవలసిన అవసరం ఉన్నదని ఆయన డిమాండ్ చేశారు. రికార్డు మార్పిడి విషయంలో ఒక అధికారి కూడా ఆరు నెలల ముందు సస్పెండ్ కావడం జరిగిందని.. సదరు దొంగ ఇంటి బిల్లులతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మున్సిపాలిటీలో క్యాన్సిలేషన్ కూడా పెట్టుకున్నారన్నారు.

ఇదంతా జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు ఎందుకు నోరు మెదపడం లేదు. ఈ కుంభకోణంలో అన్ని పార్టీల కౌన్సిలర్ కు హస్తం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి తప్పుడు పనులు చేసిన వారిపై విచారణ చేపట్టి.. వారిపై కేసు నమోదు చేయాలని.. లేకపోతే బీఎస్పీ పార్టీ పక్షాన మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News