ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల ప్రమాణం స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శుక్రవారం శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్ట్ కట్టబెట్టారు.
ఏ మంత్రికి ఏ శాఖ..? మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
1). చంద్రబాబు : సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
2). పవన్‌కల్యాణ్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
3). లోకేశ్: మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(RTG)
4). వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తు నిర్వహణ
5). అచ్చెన్నాయుడు: వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక
6). కొల్లు రవీంద్ర: గనులు అండ్ జియాలజీ, ఎక్సైజ్
7). ఆనం రాంనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ
8). నాదెండ్ల మనోహార్- ఆహార మరియు పౌరసరఫరాలు
9). పొంగూరు నారాయణ- మున్సిపల్, పట్టణాభివృద్ది
10). వై.సత్య కుమార్- వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
11). నిమ్మల రామానాయుడు- జల వనరులు
12). మహ్మద్ ఫరూఖ్- న్యాయ, మైనార్టీ సంక్షేమ
13). పయ్యావుల కేశవ్- ఆర్దిక శాఖ
14). సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్
15). పార్దసారధి- గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్
16). డోలా వీరాంజనేయ స్వామి: సోషల్ వెల్ఫేర్, సచివాలయం&వాలంటీర్స్,
17). గొట్టిపాటి రవికుమార్: విద్యుత్ శాఖ
18). కందుల దుర్గేష్: టూరిజం, సినిమాటోగ్రఫీ
19). గుమ్మడి సంధ్యారాణి: స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
20). బీసీ జనార్ధన్ రెడ్డి: ఆర్ అండ్ బీ
21). టీజీ భరత్: పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
22). ఎస్ సవిత: బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ & టెక్స్‌టైల్స్
23). వాసంశెట్టి సుభాష్: కార్మిక సంక్షేమం
24). కొండపల్లి శ్రీనివాస్: ఎంఎస్ఎంఈ, సూక్ష్మ పరిశ్రమల శాఖ
25). ఎం.రాంప్రసాద్ రెడ్డి: యువజన, క్రీడలు, రవాణా