మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న
ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 14: హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ పురపాలక సంఘ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు వేముల మంజుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకుల రజిత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుకోవాలని.. అలాగే పాఠశాలకు ఈ హుస్నాబాద్ మండలంలో పీఎంశ్రీ పథకానికి ఎన్నికైనా ఏకైక పాఠశాల అని, ఈ పీఎంశ్రీ పథకం కింద అత్యున్నతమైన సైన్స్ ప్రయోగశాల, కంప్యూటర్ లాబ్స్, డిజిటల్ బోర్డ్స్, ఒకేషనల్ కోర్సెస్ ఉన్నటువంటి ఏకైక పాఠశాల ఇదే అన్నారు.
పీఎంశ్రీ పథకం ముఖ్య ఉద్దేశం రాబోయే కాలానికి విద్యార్థులందరిలో 21 వ సెంచరీ స్కిల్స్ పెంపొందించడమే అని, ఈ సందర్భంగా గత సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల కంటే ఈ విద్యా సంవత్సరం ఎక్కువ మార్కులు,10 జీపీ లు ఎక్కువ మంది సాధించాలని, ఇన్ని సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉండగా ప్రజలు ప్రైవేట్ స్కూల్స్లలో వారి పిల్లలని చేర్చి డబ్బు వృధా చేసుకోకూడదని, వారిని ఇలాంటి పాఠశాలలో చేర్పించాలని అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు వేముల మంజుల మాట్లాడుతూ.. ఈ పాఠశాల అభివృద్ధి తనవంతు సహాకారం అందిస్తానని మాట్లాడారు. అతిథుల అందరినీ నూతన విద్యా సంవత్సరం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. వెంకటయ్య, ఉపాధ్యాయులు జి. మహేందర్, టి. లక్ష్మయ్య, ఎస్. రవీందర్, పి.రాజయ్య, జి. సాంబశివారెడ్డి, కె. సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.