ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: T20 World Cup 2024 లో ఇవాళ భారత్-కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన సూపర్-8కి చేరడంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా ఉండనుంది. దీంతో ఇప్పటి వరకు అవకాశం దక్కని శాంసన్, యశస్వి, చాహల్/కుల్దీప్ను ఆడించవచ్చు. ఇందులోనూ గెలిచి అజేయంగా నిలవాలని టీమ్ ఇండియా ఆరాటపడుతోంది. ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్‌ను రాత్రి 8 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.